News March 17, 2024
భారీగా తగ్గిన చికెన్ ధరలు

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్. గతవారం వరకు భారీగా పెరిగిన ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో కేజీ చికెన్ ధర స్కిన్‌లెస్ రూ.200 నుంచి రూ.210 ఉంది. వారం కిందట ఇది రూ.280 నుంచి రూ.310 వరకు పలికింది. ప్రస్తుతం విత్ స్కిన్ అయితే రూ.200లోపే లభిస్తోంది. ఇరు రాష్ట్రాల్లో కోళ్ల లభ్యత పెరగడమే ధర తగ్గుదలకు కారణమని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News March 7, 2026
గుడ్‌న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

AP: జలవనరుల శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.
News March 7, 2026
ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్‌పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్‌గా మారుతుంది’ అని హెచ్చరించింది.
News March 7, 2026
కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


