News March 17, 2024
విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్‌లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్
Similar News
News January 10, 2026
VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
News January 10, 2026
VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.
News January 9, 2026
100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.


