News March 17, 2024
జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులకు గ్రూప్-1 పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.
Similar News
News April 4, 2025
హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.
News April 3, 2025
ATP: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ పూర్తి కావాలి- కలెక్టర్

ప్రభుత్వం 117 జీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాఠశాలలు పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.
News April 3, 2025
అనంతపురం అభివృద్ధికి కృషి చేయాలి- కలెక్టర్

లక్ష్య, ముస్కాన్, కయకల్ప లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, జిల్లాలోని వైద్య అధికారులు, సిబ్బందికి క్వాలిటీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం DMHO కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లతో జిల్లా నాణ్యత హామీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి మొదటి గురువారం నిర్వహించాలని అన్నారు.