News January 5, 2025

సకలశాఖ మంత్రిగా నారా లోకేశ్: తాటిపర్తి

image

AP: మంత్రి నారా లోకేశ్ సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని YCP నేత తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోకేశ్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలని నిలదీశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దోపిడీ పెరిగిపోయింది. కూటమి నేతలు చెప్పే మాటలకు, పనులకు పొంతన ఉందా? ఇప్పటివరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News January 8, 2025

ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు.

News January 8, 2025

పిల్లలొద్దు.. పెట్సే ముద్దంటున్నారు!

image

ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్‌కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్‌కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.

News January 8, 2025

LRS పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్

image

TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.