News January 5, 2025

భారత్ BGT కోల్పోవడానికి కారణాలు ఇవేనా?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఈ దారుణ పరాజయానికి చాలా కారణాలు ఉన్నట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన, బుమ్రా మినహా మిగతా బౌలర్లు రాణించకపోవడం, జట్టు ఎంపిక, కూర్పులో సమస్యలు, ఆటగాళ్ల బ్యాటింగ్ వైఫల్యం, డ్రెస్సింగ్ రూమ్ వివాదాలతోనే సిరీస్ కోల్పోయిందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News January 8, 2025

NETను తొలగించాలని UGC నిర్ణయం?

image

ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పదోన్నతులకు తప్పనిసరి అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)ను తొలగించాలని UGC సిఫార్సు చేసింది. స్టాఫ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా నిబంధనలను రిలీజ్ చేసింది. FEB 5లోపు వీటిపై అభిప్రాయాన్ని సమర్పించాలని స్టేక్ హోల్డర్లను కోరింది. కొత్త రూల్స్ ప్రకారం NET రాయకుండానే ME/MTECHలో 55% మార్క్స్ సాధించిన వారు స్టాఫ్ పోస్టులకు అర్హత సాధిస్తారు.

News January 8, 2025

అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు

image

AP: అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

News January 8, 2025

విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవు: KTR నోటీసులో ACB

image

TG: విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని KTRకు ఇచ్చిన 2వ నోటీసులో ACB పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్‌ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెబుతాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవు’ అని పేర్కొంది.