News January 5, 2025
కౌలు రైతులకు భూ యజమానులు సహకరిస్తారా?
TG: భూమి లేని నిరుపేదలకు కూడా ఏటా రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ ఏ ప్రాతిపదికన ఇస్తారో ఇంకా వెల్లడించలేదు. ఈలోగా కౌలు రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం కోసం కౌలు పత్రం తీసుకోవాలా? అసలు భూ యజమానులు తమకు సహకరిస్తారా? భరోసా నిధులన్నీ ఒకేసారి ఇస్తారా? అని వారు చర్చించుకుంటున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా తమకు పథకం వర్తింపజేయాలని అంటున్నారు.
Similar News
News January 8, 2025
అమెరికాలో కెనడా విలీనం.. ట్రంప్ పోస్ట్ వైరల్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.
News January 8, 2025
కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్
AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
News January 8, 2025
రూ.2,600 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి
TG: సీఎం ఆదేశాలతో రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దని స్పష్టం చేశారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లోనూ రహదారులు మెరవాలన్నారు.