News January 6, 2025

Don’t Miss: 2 రోజులే ఛాన్స్

image

SBIలో 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి జనవరి 7తో గడువు ముగియనుంది. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనలియర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ పే నెలకు రూ.26,730. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు ఫీజు లేదు. <>సైట్<<>>: sbi.co.in

Similar News

News January 8, 2025

నిబంధనల ప్రకారమే అల్లు అర్జున్ విడుదల: డీజీ

image

TG: అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు. గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అప్‌లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

News January 8, 2025

అమెరికాలో కెనడా విలీనం.. ట్రంప్ పోస్ట్ వైరల్

image

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.

News January 8, 2025

కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్

image

AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.