News March 17, 2024
అనకాపల్లి ఎంపీ సీటు.. ఆ బీసీ ఎవరు?

అనకాపల్లి MP అభ్యర్థి పేరును వైసీపీ పెండింగ్ పెట్టింది. కూటమి అభ్యర్థిగా BJP నుంచి సీఎం రమేశ్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరగడంతో ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మాడుగుల MLA అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును MP అభ్యర్థిగా ప్రకటించి, అక్కడ నుంచి బూడి కుమార్తె, ZPTC ఈర్ల అనురాధని పోటీ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ అభ్యర్థిగా ఆ బీసీ నేత ఎవరి మీరు భావిస్తున్నారు?
Similar News
News April 4, 2025
కంచరపాలెంలో వివాహిత ఆత్మహత్య

విశాఖలో వివాహిత దేవి గురువారం ఆత్మహత్య చేసుకుంది. చీకటి దేవి(30)కి 8 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో కంచరపాలెంలో తన తల్లి దగ్గరే ఉండేది. ఏడాది క్రితం కలహాల కారణంగా పిల్లలను తల్లి దగ్గరే వదిలి తను వేరేగా ఉంటోంది. ఆ ప్రాంతంలోనే ఓ షాపులో పనిచేస్తూ దేవి రసాయనాలు తాగి స్పృహ కోల్పోయింది. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News April 4, 2025
విశాఖ: 20 బైక్‌లు సీజ్

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు 20 బైక్‌లను సీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు NAD, మద్దిలపాలెం ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా మొదటిసారి దొరికిన వారి లైసెన్స్ 3 నెలలు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన వారి వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
News April 4, 2025
వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.