News January 6, 2025
లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్

భీమవరం పట్టణంలోని ఎస్ఆర్‌కేఆర్ కళాశాలలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదివారం రాత్రి పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ స్పీకర్ అధికారులకు సూచించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీ ఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 5, 2026
మంత్రులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

మంత్రులతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డిని కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కలిసి తణుకు నియోజకవర్గానికి సంబంధించి రానున్న రోజుల్లో యూరియా అవసరాలపై చర్చించారు.
News January 5, 2026
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 179 అర్జీలు

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 179 అర్జీలు, రెవెన్యూ క్లినికల్ 86 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 5, 2026
భీమవరంలో మాతృ, శిశు మరణాలపై సమీక్ష

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో సోమవారం మాతృ, శిశు మరణాలపై సబ్ కమిటీతో సమీక్ష జరిగింది. నవంబర్‌లో జరిగిన మాతృ మరణాలపై సమావేశం నిర్వహించి సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ గీతాబాయి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలువురు వైద్యులున్నారు.


