News January 6, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన రిషి ధావన్
భారత క్రికెటర్ రిషి ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు నిన్న ఆంధ్రాతో మ్యాచ్ అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 397 రన్స్ చేసి, 11 వికెట్లు పడగొట్టారు. రిషి IND తరఫున 3వన్డేలు, ఒక T20 ఆడారు. IPLలో పంజాబ్, ముంబై, కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News January 8, 2025
టీమ్ఇండియాకు బిగ్ షాక్!
ఆస్ట్రేలియాతో జరిగిన బీజీటీ చివరి మ్యాచులో టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. గాయం గ్రేడ్-1 కేటగిరీలో ఉండటంతో ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నాయి. ఇక ఆయన ఐపీఎల్‌లోనే ఆడతారని అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.
News January 8, 2025
కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
TG: ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్‌ను తీసుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు నిరాకరించగా సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు వెళ్లనున్నారు. లైబ్రరీలో కేటీఆర్ న్యాయవాది కూర్చోని విచారణను చూసే సౌకర్యం ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణ తర్వాత అనుమానాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
News January 8, 2025
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా సరికాదు: కైఫ్
టెస్టుల్లో కెప్టెన్ రోహిత్‌కు వారసుడిగా బుమ్రా సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్ అయితే సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రాహుల్, పంత్‌లో ఆ లక్షణాలున్నాయని, వారిద్దరికీ ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉందని తెలిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.