News January 6, 2025

రైతుభరోసాపై నేడు బీఆర్ఎస్ నిరసనలు

image

TG: రైతు భరోసాపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు BRS సిద్ధమైంది. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15వేల ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలే ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు.

Similar News

News January 8, 2025

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్

image

జమిలి ఎన్నికలపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జమిలి ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆర్థిక సాధ్యాసాధ్యాలు, అవసరమైన ఈవీఎంలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల్ని జమిలి ఎన్నికలు ఉల్లంఘిస్తాయని ప్రియాంక పేర్కొన్నట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.

News January 8, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా సిద్ధం కాని స్టేడియాలు?

image

వచ్చే నెలలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టోర్నీ ప్రారంభానికి మరో 40 రోజులే ఉన్నా స్టేడియాల మరమ్మతుల్లో PCB తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగే స్టేడియాల్లో సీట్లు, ఫ్లడ్ లైట్లు, ఎన్‌క్లోజర్ సౌకర్యాలు కల్పించలేదని సమాచారం. ఔట్‌ఫీల్డ్, పిచ్‌లు కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. మ్యాచ్‌లు నిర్వహించే లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో ఇదే పరిస్థితి నెలకొందని టాక్.

News January 8, 2025

ఆయన ఆడిషన్ అడిగితే షాకయ్యా: హీరోయిన్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాల్ చేసి ఆడిషన్ అడిగితే షాకైనట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలిపారు. మొదట అనిల్ కాల్ చేయగానే ఎవరో తెలియదని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గురించి గూగుల్ చేసి తెలుసుకున్నట్లు చెప్పారు. సినిమాలో రోల్ కోసం లుక్ టెస్టు చేయాలని దర్శకుడు కోరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ మూవీలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య కనిపించనున్నారు.