News January 6, 2025
వైయస్సార్ జిల్లా అటవీ విస్తీర్ణం ఎంతో తెలుసా.?

YSR టెరిటోరియల్ విస్తీర్ణం 2,98,07,827 హెక్టార్లు. ఏపీలో అటవీ విస్తీర్ణం రీత్యా అతిపెద్ద అరణ్యాలు కడప జిల్లాలో ఉన్నట్లు 1882 మద్రాస్ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో అమెజాన్ అడవుల కంటే దట్టమైన అడవుల 1.శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం, 2.శ్రీపెనుశిల అభయారణ్యం, 3.నల్లమల అడవులు, 4.పాలకొండ రక్షిత అరణ్యం, 5.గంగన పల్లె రక్షిత అరణ్యం, 6.శేషాచలం వంటి రహస్య అడవులు ఈ జిల్లాలో ఎన్నో ఉన్నాయన్నారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.