News January 6, 2025

7న తిరుమలలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేసింది. జనవరి 10-19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు VIP బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 6న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News January 8, 2025

గ్రూప్-3 కీ విడుదల

image

TG: గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి ఇవాళ ‘కీ’ని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఇంటర్వ్యూ ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏడాది వ్యవధిలో, లేని వాటిని 6-8 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించింది. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని పేర్కొంది.

News January 8, 2025

నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, SSC ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

News January 8, 2025

11వేల రుద్రాక్షలను ధరించి మహాకుంభమేళాకు వచ్చిన బాబా

image

మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, రుషులు, సాధువులు, బాబాలు, అఘోరాలు నదీ స్నానం చేసేందుకు ప్రయాగరాజ్‌కు వెళ్తున్నారు. అయితే, అక్కడికి వచ్చిన
ఓ రుద్రాక్ష బాబా ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏకంగా 30 కేజీల బరువున్న 11వేల రుద్రాక్షలను ధరించారు. తనను ప్రజలు రుద్రాక్ష బాబా అని పిలుస్తారని, చాలాకాలంగా వీటిని ధరిస్తున్నట్లు ఆయన తెలిపారు.