News January 6, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా వాసులు స్పాట్‌డెడ్
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన ఇద్దరు మహిళలు సోమవారం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తుల బృందాన్ని, మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న 108 వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.
Similar News
News January 8, 2025
పుల్లంపేటలోని శ్రీ సంజీవరాయస్వామికి పొంగళ్లు
పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్లు ఈ నెల 12వ తేదీ , సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం వైభవంగా జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు అయితే ఎక్కడైనా మహిళలు పొంగళ్లు పెట్టండం చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం పురుషులే పొంగళ్లు పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ముందు రోజు రాత్రి నుంచే కోలాటం, చెక్క భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
News January 8, 2025
కడప జిల్లాలో నేడు ప్రధాని ప్రారంభించేవి ఇవే
ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ. 135 కోట్లతో మైదుకూరు – ముదిరెడ్డిపల్లె 2 లైన్ల రోడ్డు విస్తరణ, రూ. 1.321 కోట్లతో వేంపల్లి – చాగలమర్రి 2/4 వరుసల విస్తరణ పనులు చేపట్టనున్నారు. తమ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 8, 2025
కడప: 7వ రోజు పకడ్బందీగా కానిస్టేబుల్ దేహారుడ్య పరీక్షలు
ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహారుడ్య పరీక్షలను కడప జిల్లా కేంద్రంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్ర మైదానంలో జిల్లా ఇన్‌ఛార్జి విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో కట్టుదిట్టంగా నిర్వహించారు. 7వ రోజు దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు.