News March 17, 2024
HYD: వ్యభిచార గృహంపై RAIDS

వ్యభిచార గృహంపై బంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. అయితే డబ్బులకు ఆశపడి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించింది. పోలీసులు గృహంపై రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్‌తో పాటు కస్టమర్‌ను పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
Similar News
News April 11, 2026
RR: ALERT బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు!

RR జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రొద్దుటూరు, మహేశ్వరంలో 40.8, కేశంపేట 40.7, యాచారం, మొయినాబాద్ 40.6, షాబాద్ 40.5, చిలుకూరు 40.4, కందుకూరు, రాచలూరు 40.1, చౌదరిగూడెం 40.2, మంచాల, బోడకొండ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News April 10, 2026
ప్రత్యేక ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్ల ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, మూడు పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ. 14,500 నుంచి రూ. 34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
News April 8, 2026
ఆమనగల్లు: WOW.. వరి నాటుతున్న రాహుల్ గాంధీ, సీఎం

ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి వేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతు కుటుంబానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసని, రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ ఓకే సారీ అందించి ఆదుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, సీఎం, రైతులతో కలిసి వరి నాటుతున్నట్లు చిత్రం రూపొందించారు. చిత్రకారుడి చిత్రాన్ని రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.


