News January 6, 2025
చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..!
చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 8, 2025
HYD: హామీలు అడిగినందుకు అక్రమ కేసులు: హరీష్ రావు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు.
News January 8, 2025
HYD: చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని HYD ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్‌లో ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. సమావేశంలో కలెక్టర్ అనుదీప్, అధికారులు ఉన్నారు.
News January 8, 2025
HYD: జైలులోనే డిగ్రీ, పీజీ చేశారు
HYDలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్షిక రిపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2024లో రాష్ట్రంలో జైలుకెళ్లిన వారిలో 750 మంది గ్రాడ్యుయేషన్, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసినట్లుగా పేర్కొంది. జైళ్లలో ఉండి చదువుకోవాలనుకున్న వారికి చెంగిచెర్ల, చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలోని జైళ్లలోనూ అవకాశం కల్పించారు.