News January 6, 2025
టీమ్ ఇండియా ఓటమికి కారణం అదే: గంగూలీ

BGT సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘టెస్ట్ క్రికెట్లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. 170, 180 రన్స్ చేస్తే మ్యాచులు గెలవలేం. 350-400 పరుగులు చేయాలి. ఓటమి విషయంలో ఎవరినీ నిందించలేం. అందరూ రన్స్ చేయాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. BGTలో రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2026
ఇళ్లు, పొలం దగ్గర ఈ మొక్కల పెంపకంతో ఆహారం, ఆరోగ్యం

బొప్పాయి, అరటిలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి, జామ, నిమ్మలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగ, అవిసె, బచ్చలి, ఆకుకూరల నుంచి పీచుపదార్థం, ఖనిజ లవణాలు మెండుగా అందుతాయి. కరివేపాకు క్యాన్సర్ నిరోధకారిగా పనిచేస్తుంది. కుంకుడు తల వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడి అనేక ఔషధ గుణాలు కలిగి మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
News January 9, 2026
NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News January 9, 2026
ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.


