News January 6, 2025
అనంత శ్రీరామ్ కామెంట్స్‌పై ‘కల్కి’ డైరెక్టర్ స్పందన!
మూవీల్లో మన పురాణాలను <<15072339>>వక్రీకరిస్తున్నారని<<>> సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘అమెజాన్ జపాన్‌లో ట్రాన్స్‌లేటెడ్ మహాభారతం పుస్తకాలు భారీగా విక్రయించారు. ఇది చాలా బాగుంది’ అని రాసుకొచ్చారు. అనువదించిన మహాభారతం పుస్తకాలనే ఎక్కువ మంది చదివారని ఆయన పోస్ట్ సారాంశం.
Similar News
News January 8, 2025
బాలకృష్ణకు అలా పిలిస్తేనే ఇష్టం: శ్రద్ధా శ్రీనాథ్
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనను ‘సార్’ అని పిలవొద్దని చెప్పేవారని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. ‘బాలా’ అని పిలవాలని సూచించేవారని చెప్పారు. ‘బాలయ్య సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటారు. ఆయన దర్శకుల హీరో. డైరెక్టర్ ఏది చెబితే అది మొహమాటం లేకుండా చేస్తారు. దర్శకుడికి పూర్తిగా లొంగిపోతారు. డాకు మహారాజ్‌లో నటించడం నా అదృష్టం’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.
News January 8, 2025
APPLY NOW.. 600 ఉద్యోగాలు
SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <
News January 8, 2025
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.