News March 17, 2024
లింగంపేట: పెళ్లికి వెళ్లొస్తున్న ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. నిజాంసాగర్ మండలం సింగితం, గున్కుల్, వడ్డెపల్లి నుంచి పలువురు కొర్పోల్‌లో పెళ్లికి వెళ్లారు. రిటన్‌లో 12 మందితో వస్తున్న ఆటో బాయంపల్లి శివారులో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో సంగయ్య, లావణ్య మృతి చెందారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
NZB: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి’

ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB కలెక్టర్, ఇతర అధికారులతో ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.
News October 25, 2025
నిజామాబాద్: మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: కలెక్టర్

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్‌లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగంపై వివరించారు.


