News January 6, 2025

ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్

image

AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

Similar News

News January 8, 2025

కోహ్లీ నాకు దేవుడు: కోన్‌స్టాస్

image

విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.

News January 8, 2025

‘గేమ్ ఛేంజర్‌’ టికెట్ ధరల పెంపు

image

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతిస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది.

News January 8, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. డిమాండ్ ఎందుకంటే..

image

హిందువులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో ఆలయ ప్రవేశం సర్వపాప హరమని విశ్వాసం. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనమంటే సాక్షాత్తూ ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు. ఏడాదిలో 10రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.