News March 17, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,513 కేసులు పరిష్కారం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 64 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,513 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.2.30 కోట్ల నష్టపరిహారం అందజేశారు.
Similar News
News December 28, 2025
పథకాల అమలుకు సిటిజన్ ఈకేవైసీ తప్పనిసరి: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే లక్ష్యంతో జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను చేయించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగ స్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1,48,969 Citizen e-KYCలు ఉండగా, ఇప్పటి వరకు 43,306 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 1,05,663 పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
News December 28, 2025
రాజమండ్రి: జనవరి 5న రేషన్ బియ్యం బహిరంగ వేలం

జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన 33.85 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జనవరి 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ ఆదివారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద గల పౌరసరఫరాల కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. జనవరి 3న నమూనాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు ఈ వేలానికి అనర్హులని స్పష్టం చేశారు.
News December 28, 2025
‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.


