News January 6, 2025
ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే బాగుంది: హర్భజన్
రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు ప్రదర్శన బాగుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. గత ఆర్నెళ్లుగా టీమ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆందోళనకరంగా ఉందని తన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచుల్లో భారత జట్టు సత్తా చాటాల్సి ఉందని తెలిపారు. రోహిత్, కోహ్లీ ఎవరైనా ఆట కంటే ఎక్కువ కాదని, మెరుగ్గా ఆడితేనే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 8, 2025
బ్యాంకాక్‌లో అంతగా ఏముంది!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్శించడంలో బ్యాంకాక్ ముందుంది. 32.4 మిలియన్ల సందర్శకులను స్వాగతించి బ్యాంకాక్ ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటకప్రాంతంగా నిలిచింది. దీనికి ముఖ్యకారణం అక్కడి పర్యాటక విధానం, సోషల్ మీడియాలో పెరిగిన ఆదరణే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 94 దేశాల పర్యాటకులకు వీసా లేకుండా ప్రవేశించే విధానం తీసుకురావడమే. బ్యాంకాక్ అంటే మీకూ ఇష్టమా? COMMENT
News January 8, 2025
చాహల్‌తో విడాకుల ప్రచారం.. ఇన్‌స్టాలో ధనశ్రీ పోస్ట్
చాహల్‌తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.
News January 8, 2025
అందుకే బీర్ల ధరలు పెంచలేదు: మంత్రి జూపల్లి
TG: యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.