News March 17, 2024

గ్రూప్-1 ఉద్యోగాలు.. ఒక్క పోస్టుకు 715 మంది పోటీ!

image

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 4.03లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క పోస్టుకు దాదాపు 715 మందికి పైగా పోటీ పడుతున్నారు. 2022 నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి 23 వేల అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. దరఖాస్తుల సవరణకు ఈనెల 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహించనున్నారు.

Similar News

News August 19, 2025

చైనాలో తైవాన్‌ భాగమేనని భారత్ చెప్పిందా?

image

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ‌తో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.

News August 19, 2025

పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

image

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.

News August 19, 2025

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తెల్లవారుజామున తీరం దాటినట్లు APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రలోని కృష్ణా, ఏలూరు, అల్లూరి, వైజాగ్, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.