News March 17, 2024
జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ రూమ్ ఏర్పాటు చేశామని తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని పేర్కొన్నారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్సీసీ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News April 9, 2026
దొంగలు బాబోయ్.. రోజుకో చోరీ

పుట్లూరు మండలంలో విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలు పెరగడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. నిన్న చింతలపల్లె ఘటన మరువకముందే పుట్లూరులోని వ్యవసాయ పొలాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లు దోచుకెళ్లారు. రైతులు లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పెద్దయ్యలకు చెందిన వైర్లు పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుస దొంగతనాలతో సాగుకు ఆటంకం కలుగుతోందని రైతులు వాపోతున్నారు.
News April 8, 2026
ఐటీ రంగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వండి: ఎంపీ

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం జేఎన్‌టీయూ వీసీ సుదర్శన్ రావును కలిసి బెంగళూరు ఐటీ నిపుణుల బృందాన్ని పరిచయం చేశారు. చివరి ఏడాది విద్యార్థులకు ఏఐ వంటి ఆధునిక అంశాలపై శిక్షణ ఇస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విసి, త్వరలోనే కమిటీ వేసి శిక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.