News January 6, 2025
‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడినట్లేనా?
ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. APR 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించగా అదే తేదీన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’లు ఏప్రిల్ 10న వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజాసాబ్’ విడుదల తేదీని మారుస్తారని పేర్కొన్నాయి.
Similar News
News January 9, 2025
తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ సూచించారు.
News January 9, 2025
కొందరు అధికారుల వల్లే ఈ ఘటన: చంద్రబాబు
AP: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
News January 9, 2025
రద్దీ కారణంగానే ముందుగా టోకెన్లు జారీ: TTD ఈవో
AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.