News January 6, 2025
GNT: కుష్టు వ్యాధి అవగాహణ పోస్టర్ల ఆవిష్కరణ

సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
Similar News
News January 16, 2026
GNT: డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు జాక్‌పాట్

17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్‌పాట్”గా అభివర్ణిస్తున్నారు.
News January 15, 2026
సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.
News January 15, 2026
GNT: రంగస్థల దిగ్గజం మొదలి నాగభూషణశర్మ

గుంటూరు (D) ధూళిపూడిలో 1935 జులై 24న జన్మించిన మొదలి నాగభూషణశర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. సుమారు 70కి పైగా నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రచించారు. సాహిత్యం, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (2013) వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 2019 జనవరి 15న తెనాలిలో మరణించారు.


