News March 17, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

✔కోడ్ కూసింది.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి
✔పదో తరగతి పరీక్షలపై అధికారుల సమీక్ష
✔నూతన ఓటు నమోదు పై అధికారుల ఫోకస్
✔శ్రీరంగాపురం:నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(ఆది):6:34,సహార్(సోమ):5:02
✔నేడు సార్వత్రిక డిగ్రీ తరగతులు
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔NRPT:పలు మండలాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్
Similar News
News March 20, 2026
పాలమూరు: రేపే..రంజాన్ వేడుకలు!!

ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు (ఈద్-ఉల్-ఫితర్) ఈనెల 21న జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని సూచించారు. రంజాన్ మాసం నేటితో (మార్చి 20) ముగియనుందని చెప్పారు. ముస్లిం సోదరులు (నమాజ్) ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
News March 19, 2026
MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.
News March 19, 2026
MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.


