News January 6, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News January 8, 2025

NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ

image

సైబర్ నేరాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసీపీ వెంకటేశ్వర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఆయన ప్రస్తావించారు. వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ ఫోన్ లకు వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు.

News January 8, 2025

NZB: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పే అంశంపై సమీక్ష జరిపారు.

News January 8, 2025

NZB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

image

ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.