News January 6, 2025

దీర్ఘాయువు కోసం వీటిని పాటించండి!

image

సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి మూడు సూత్రాలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ‘రెడ్ మీట్‌ స్థానంలో చేప మాంసాన్ని తినండి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. మీ వైద్యుడితో చర్చించి మీకు ఉత్తమమైన ఆహారం ఏంటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా రోజూ ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. అనేక వ్యాధులకు ఒంటరితనం ప్రధాన కారకం. దీర్ఘాయువు కోసం స్నేహితులు, కుటుంబంతో రోజూ కొంత సమయం గడపండి’ అని తెలిపారు.

Similar News

News January 9, 2025

సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.

News January 9, 2025

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం

News January 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.