News January 6, 2025
నంద్యాల జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టి తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల సవరణ అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్లలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారన్నారు.
Similar News
News January 8, 2025
20న దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు
ఈనెల 20న కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఆయన బుధవారం వికలాంగుల సంక్షేమ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.
News January 8, 2025
కర్నూలు: పెళ్లయిన 21 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్
పెళ్లయిన 21 రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. కర్నూలుకు చెందిన రాకేశ్ గౌడ్(34)కు కొన్ని రోజుల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకొని అరుణ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 8, 2025
రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
పాణ్యం మండలంలోని పిన్నాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, పిన్నాపురంలోని గ్రీన్ సోలార్ పార్కును, పంపింగ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం పవర్ హౌస్‌ను సందర్శిస్తారని తెలిపారు.