News January 6, 2025
SKLM: వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టండి

వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టి రెవెన్యూ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా మైనార్టీ అధికారి మెంబర్ అండ్ కన్వీనర్ ఆర్ ఎస్ జాన్ సమక్షంలో జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాక్ఫ్ ఆస్తులను ఏడీ సర్వే ద్వారా సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News February 1, 2026
రణస్థలం: ‘లేబర్ కోడ్లను రద్దు చేయాలి’

లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆదివారం ఫిబ్రవరి 12 సమ్మె కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు మేలు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు.
News February 1, 2026
నేడు టెక్కలిలో రెవెన్యూ క్లినిక్.!

శ్రీకాకుళం జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా మొత్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఈ క్లీనిక్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 1, 2026
పాతపట్నం అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

పాతపట్నంలో ఓ ప్రైవేట్ కళ్యాణ్ మండపంలో నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గోవిందరావు శనివారం నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం అంశాలపై శాఖల వారీగా విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, అధికారులు నాయకులున్నారు.


