News January 6, 2025

గుంటూరు: 11 మందికి కారుణ్య నియామకాలు

image

కారుణ్య నియామకంలో భాగంగా వివిధ పోస్టులకు జిల్లాలో 11 మంది ఎంపికయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ నాగలక్ష్మీ అందించారు. ఇద్దరికి జైళ్ల శాఖ, ఇద్దరికి గ్రౌండ్ వాటర్, ఇద్దరికి పోలీస్ శాఖ, ఇరిగేషన్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలలో జేఓఏలుగా నియమించారు. ఉద్యోగాలు పొందిన వారు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.

Similar News

News January 8, 2025

విజయపురిసౌత్‌: వివాహిత అనుమానాస్పద మృతి

image

వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన పల్నాడు(D) మాచర్ల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌కు చెందిన బత్తుల కల్పన (28) ఉరి వేసుకుందంటూ భర్త సురేశ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు భర్త సురేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News January 8, 2025

గుంటూరు: మద్యం జోలికి వెళ్లని గ్రామమది..

image

పొన్నూరు(M) వెల్లలూరు ఒకనాడు ఫ్యాక్షనిజంతో అట్టుడికేది. అలాంటి గ్రామం నేడు మహనీయుడు విశ్రాంత న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు ఆశయాలకు అనుగుణంగా మద్యానికి దూరంగా ఉంటూ గ్రామస్వరాజ్యం వైపు అడుగులు వేస్తోంది. 15ఏళ్ల క్రితం వరకు గ్రామంలో స్వల్ప కారణాలతో చంపుకునే వరకు వెళ్లేవారు. ఇది చూసి చలించిన లక్ష్మణరావు గ్రామ ప్రజలతో సమావేశమై మద్యపాన నిషేధానికి నాంది పలికారు. ఆనాటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు లేవు.

News January 8, 2025

 భర్తను చంపేందుకు భార్య పన్నాగం.. అరెస్ట్

image

మంగళగిరి పరిధి యర్రబాలెంకు చెందిన వివాహిత తన భర్తను చంపేందుకు తన ప్రియునితో కలిసి పథకం వేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రూరల్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. వివాహిత కుక్క పిల్లలను అమ్ముతూ ఉంటుందని ఈ క్రమంలో విజయవాడకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తన భర్తను చంపేందుకు ఓ రౌడీ షీటర్ సహాయం తీసుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపామన్నారు.