News January 6, 2025
HYD: నూతన ఇంధన విధానాన్ని ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం

పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలు అందజేశారు.
Similar News
News July 9, 2025
మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ ఇచ్చి గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.
News July 9, 2025
నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు
News July 9, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే సామాజిక సేవ

ఫూటుగా మద్యం తాగి బండ్లు నడుపుతూ పట్టుబడిన వారు సామాజిక సేవచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌లో చిక్కిన ముగ్గురికి మేడ్చల్ అత్వెల్లి కోర్టులో 2రోజులు, సుచిత్ర కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్, అవేర్నెస్, రోడ్లు మరమ్మతులులో పాల్గొనాలని ఆదేశించిందని తెలిపారు. శిక్ష అమలులో భాగంగా నిందితులు సుచిత్ర కూడలిలో పనులు చేశారు.