News January 7, 2025

సంక్రాంతి సినిమాలు.. ఏ ట్రైలర్ నచ్చింది?

image

సంక్రాంతికి ఈ సారి టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన ‘<<15045920>>గేమ్ ఛేంజర్<<>>’ ఈ నెల 10న, బాలకృష్ణ ‘<<15069637>>డాకు మహారాజ్<<>>’ 12న, వెంకీ మామ ‘<<15081100>>సంక్రాంతికి వస్తున్నాం<<>>’ 14న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్లు చూస్తే ఆయా సినిమాలు వేర్వేరు కథాంశాలతో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. మరి వీటిలో మీకు ఏ ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేయండి?

Similar News

News November 4, 2025

త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ

image

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.

News November 4, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

image

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>