News January 7, 2025

నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి

image

నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

Similar News

News January 9, 2025

NZB: మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో కురగాయల వ్యాపారుల ఆందోళన

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఎదుట కూరగాయల వ్యాపారాలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక అంగడి బజార్‌లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్‌లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజువారీ వ్యాపారాలు దెబ్బతింటాయని MIM నేతలు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

News January 8, 2025

NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ

image

సైబర్ నేరాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసీపీ వెంకటేశ్వర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఆయన ప్రస్తావించారు. వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ ఫోన్ లకు వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు.

News January 8, 2025

NZB: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పే అంశంపై సమీక్ష జరిపారు.