News January 7, 2025
HYD: hMPV పాత వైరస్.. జాగ్రత్త మంచిది: మంత్రి రాజనర్సింహ
hMPV అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ సంవత్సరం hMPV కేసులు ఎక్కువయ్యాయన్నారు.
Similar News
News January 8, 2025
HYD: బీర్ల రేటు పెంపుపై కమిటీ నిర్ణయమే ఫైనల్: మంత్రి
బీర్ల రేట్లు పెంచనందుకు బీర్ల స్టాక్ పంపమని బేవరేజ్ సంస్థ ప్రకటించింది. 33శాతం పెంచమని అడుగుతున్నారని, ఇలా పెంచితే ఇప్పుడు రూ.150 రూపాయలు ఉన్న బీర్ రూ.250 పెరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందన్నారు. రేట్లు పెంచే సిస్టం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
News January 8, 2025
HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ
2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.
News January 8, 2025
HYD: 100పడకల ఆస్పత్రిగా అమీర్‌పేట్ హెల్త్ సెంటర్: మంత్రి
50 పడకల ఆసుపత్రిగా ఉన్న అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సందర్శించి ఆస్పత్రిలో సర్జరీ వార్డ్, గర్భిణీల వార్డ్, ఫార్మసి, చిన్నపిల్లలకు మందులు ఇచ్చే గది, రిజిస్టర్‌లను పరిశీలించారు.