News January 7, 2025

‘అనంతపురం జిల్లాలో హెచ్ఎంపీవీ కేసులు లేవు’

image

చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News January 9, 2025

వైకుంఠ ఏకాదశి వేడుకలకు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం ముస్తాబు

image

కదిరిలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఈనెల 10న తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం ద్వారాలు తెరచి శుద్ధి వచనం, విశేష పూజ, మహా మంగళహారతి ఉంటుందని అర్చకులు తెలిపారు. అనంతరం 3.30 గంటల నుంచి ఉత్తర ద్వార ప్రవేశం భక్తులకు కల్పిస్తామని పేర్కొన్నారు.

News January 8, 2025

ఒకే చోట జేసీ బ్రదర్స్

image

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకే చోట కనిపించారు. తాడిపత్రిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను వారు తిలకించారు. ప్లేయర్లును ఉత్సాహపరిచారు. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకచోట కనిపించడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

News January 8, 2025

అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ చేతుల మీదుగా..

image

విశాఖ వేదికగా జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. వివరాలు ఇలా..
☛ రూ.160 కోట్లతో తాడిపత్రి బైపాస్‌ 4 వరుసల విస్తరణకు శంకుస్థాపన
☛ రూ.352 కోట్లతో గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన
☛ మడకశిర-సిర, ముదిగుబ్బ బైపాస్‌, బత్తలపల్లి-ముదిగుబ్బ నాలుగు వరుసల రహదారి ప్రారంభోత్సవం
☛ రూ.998 కోట్ల నిర్మించిన గుత్తి-ధర్మవరం రైల్వే లైన్‌ ప్రారంభోత్సవం