News January 7, 2025
నైట్‌క్లబ్ బౌన్సర్ నుంచి ప్రధానిగా.. ట్రూడో నేపథ్యమిదే!
కెనడా PMగా దిగిపోనున్నట్లు <<15083640>>ప్రకటించిన<<>> జస్టిన్ ట్రూడో ఆ దేశ మాజీ ప్రధాని పెర్రె ట్రూడో పెద్ద కుమారుడు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్, నైట్‌క్లబ్ బౌన్సర్, స్నోబోర్డ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. 2015లో PMగా బాధ్యతలు చేపట్టి కెనడా రెండో యంగెస్ట్ ప్రధానిగా నిలిచారు. వలసవాదానికి మద్దతు, లింగ సమానత్వాన్ని ప్రోత్సాహించడం వంటి అంశాలు పార్టీలో ఆయనపై వ్యతిరేకతకు కారణమయ్యాయి.
Similar News
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News January 9, 2025
కారులో ప్రేమజంట సజీవదహనం.. నిందితుడు అరెస్ట్
TG: హైదరాబాద్‌లో కారులో ప్రేమజంట సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరి మరణానికి కారణమైన నిందితుడు మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ (25), లిఖిత (17) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో లిఖిత బంధువు మహేశ్ వీరి ప్రేమ గురించి ఇంట్లో చెబుతానని బెదిరించడంతో పలుసార్లు రూ.1.35 లక్షలు ఇచ్చారు. ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో వారు కారు అద్దెకు తీసుకుని అందులోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
News January 9, 2025
తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ సూచించారు.