News January 7, 2025

టెంబా బవుమా సరికొత్త రికార్డ్

image

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్‌పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్‌మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.

Similar News

News January 9, 2025

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

* 1915: మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చిన రోజు
* 1922: ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా జననం
* 1934: బాలీవుడ్ సింగర్ మహేంద్ర కపూర్ జననం
* 1965: సినీ డైరెక్టర్, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పుట్టినరోజు
* 1969: తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం
* ప్రవాస భారతీయుల దినోత్సవం

News January 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 9, 2025

దోమలను చంపేందుకు కొత్త ప్లాన్!

image

మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కారణమైన దోమల నివారణకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ వర్సిటీ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో శృంగారం చేసే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని చూస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈగలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎవరికీ హాని లేదని నిర్ధారించాకే ముందుకు వెళ్తామన్నారు.