News January 7, 2025

NZB: చైనా మాంజా అమ్మకందారులకు హెచ్చరిక

image

నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి హెచ్చరించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చైనా మాంజా నిలువ ఉంచినా, అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి NZB కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని, వారు మాంజాను అప్పగించాలన్నారు.

Similar News

News January 9, 2025

కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి

image

కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.

News January 9, 2025

NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.

News January 9, 2025

NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.