News January 7, 2025

hMPV గురించి సౌమ్య స్వామినాథన్ ఏమన్నారంటే?

image

ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న hMP వైరస్ గురించి ఆందోళన వద్దని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలోనే ఉందన్నారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, జలుబు చేసినప్పుడు నార్మల్‌గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019లో కరోనా సమయంలో సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు.

Similar News

News January 9, 2025

ప్రముఖ నిర్మాత కన్నుమూత

image

ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది(73) కన్నుమూశారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ TOI తదితర సంస్థల్లో పనిచేశారు. గతంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు.

News January 9, 2025

సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్

image

TG: PAC సమావేశంలో మంత్రులకు AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. CMను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మంత్రులెందుకు స్పందించడంలేదని నిలదీశారని తెలుస్తోంది. తాను స్పందిస్తున్నానని ఓ మంత్రి చెప్పగా, ఎవరేం చేస్తున్నారో తనకంతా తెలుసని అన్నారు. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించినట్లు సమాచారం.

News January 9, 2025

రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-2 ‘కీ’ని రేపు(జనవరి 10) విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్ డిజైన్ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. కాగా నిన్న గ్రూప్-3 <<15099005>>‘కీ’ని<<>> టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.