News March 17, 2024

పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్‌ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.

Similar News

News February 3, 2026

తూ.గో: స్కూల్ ఆటోలపై రవాణా శాఖ కొరడా

image

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న 11 ఆటోలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 2, 2026

తూ.గో: ”పులి’ సంచారంపై అపోహాలు నమ్మవద్దు’

image

సీతానగరం మండలంలోని పెద్దకొండెపూడి, చిన్నకొండెపూడి, తొర్రేడు గ్రామాల్లో గత మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. పాదముద్రల ఆధారంగా పులి వెంకటనగరం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు పులిపై వచ్చే అపోహలను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియోలు, ఫేక్ ఫోటోలను చూసి భయాందోళన చెందవద్దని అధికారులు కోరారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 2, 2026

తూ.గో: ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ

image

రాజానగరం నుంచి కాకినాడ వెళ్తున్న లారీ రామేశ్వరంపేట సెంటర్ వద్ద అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.