News March 17, 2024
నంద్యాల జిల్లాలో ఒక అభ్యర్థి మినహా.. అందరూ రెడ్డిలే

నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ అభ్యర్థి డా.ధారా సుధీర్(SC) మినహా మిగిలిన వారందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనర్హం. డోన్-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, BPL-కాటసాని రామిరెడ్డి, NDL-శిల్పా రవిరెడ్డి, PNM-కాటసాని రాంభూపాల్ రెడ్డి, ALG -గంగుల బ్రిజేంద్రారెడ్డి, SRLM-శిల్పా చక్రపాణి రెడ్డి MLA అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. నంద్యాల MP అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఆ సామాజికవర్గం వారే.
Similar News
News April 4, 2025
కర్నూలు: ‘విమానాశ్రయానికి వసతులు కల్పించాలి’

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 4, 2025
కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.
News April 4, 2025
కర్నూలు: ‘న్యాయవాదులకు స్టాంపుల కొరత రానివ్వం’

న్యాయవాదులకు కోర్టు స్టాంపుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.