News January 7, 2025
అనంతకు ‘డాకు’ టీమ్
అనంతపురంలో ఈ నెల 9న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. సినీ తారలు సీమకు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతలో సందడి చేయనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ రానున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ జరగనుంది.
Similar News
News January 9, 2025
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. అందులో ఎఫ్ఎన్‌వో 18, సానిటరీ అటెండర్, వాచ్‌మెన్ 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఈనెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 9, 2025
రాయదుర్గం కేటీఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ప్రతిభ
రాయదుర్గంలోని కేటీఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ ద్వితీయ ఏడాది చదువుతున్న యోగేశ్వరి, గోపాల్ ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారిలో నిలిచారు. ఇటీవల 15 రోజుల పాటు ఉత్తర కాశీలోని హిమాలయ పర్వతారోహణకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 17 ఎన్సీసీ కమాండెంట్లకు చెందిన క్యాడెట్లు హాజరుకాగా ఏపీ తరఫున యోగేశ్వరి, గోపాల్ ఉండడం గమనార్హం. కళాశాల బృందం వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు.
News January 9, 2025
తారలు వస్తున్నారు!
అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ టీమ్ సందడి చేయనుంది. శ్రీనగర్‌కాలనీ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోని ఖాళీ ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతపురానికి వస్తున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది.