News January 7, 2025

చిత్తూరు ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా డాక్టర్ రవిప్రభు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.

Similar News

News January 9, 2025

తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన భూమన

image

వివాదాస్పద వ్యక్తులకు TTD పాలనా పగ్గాలు ఇస్తే ఇలాగే ఉంటుందని మాజీ ఛైర్మన్ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆయన మాట్లాడుతూ.. టీడీడీ చరిత్రలో ఇదో చీకటి రోజని, CM చంద్రబాబు పాలనా వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికీ పుష్కరాల ఘటన వెంటాడుతుందన్న ఆయన తాజా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. YCP పాలనలో ఎన్నడూ ఇలా జరగలేదని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు.

News January 9, 2025

తిరుపతి రుయాలో పోస్ట్‌మార్టం

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరందరికీ మరికాసేపట్లో రుయా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్‌మార్టం చేయనున్నారు. స్విమ్స్‌లో చనిపోయిన ఇద్దరు, రుయాలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు ఇక్కడే శపపరీక్ష చేసి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.

News January 9, 2025

తిరుపతి ఘటన బాధాకరం: AP గవర్నర్ 

image

తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడిన ఘటనపై AP గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.