News March 17, 2024

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్, హరీశ్

image

TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను కలిసేందుకు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు.

Similar News

News March 5, 2026

బిహార్‌లో తొలి బీజేపీ సీఎం.. రంగం సిద్ధం!

image

మోదీ నేతృత్వంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP అనేక రాష్ట్రాలపై పట్టు సాధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో బిహార్ కూడా చేరనుంది. సీఎం నితీశ్ RSకు వెళ్లనుండటంతో ఆయన స్థానంలో తొలిసారి <<19302367>>BJP నేత<<>> CM పీఠం ఎక్కే అవకాశం ఉంది. 2014 తర్వాత అస్సాంలో శర్బానంద, మణిపుర్‌లో బీరేన్‌సింగ్, త్రిపురలో బిప్‌లాబ్, హరియాణాలో మనోహర్, అరుణాచల్‌లో పెమా ఖండు, ఒడిశాలో మోహన్ BJP నుంచి తొలిసారి CMలు అయ్యారు.

News March 5, 2026

సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

image

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.

News March 5, 2026

లోన్‌పై బండి కొన్నారా? ఆ ఇబ్బంది ఉండదిక!

image

లోన్‌పై వెహికల్ తీసుకుంటే ఉండే హైపోథికేషన్ మార్క్ తొలగింపు ఇక ఈజీ కానుంది. రుణ చెల్లింపు పూర్తయితే RTOకు ఆన్‌లైన్లో బ్యాంకులు సమాచారం అందిస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యే ఫీచర్‌ను కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. SBI, 5 NBFCలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని త్వరలో అన్ని బ్యాంకులకూ విస్తరించనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే నో డ్యూ కాపీలు RTO ఆఫీసులకు వెళ్లి ఇస్తే ఇది పోతుంది.