News March 17, 2024
ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్‌ల వైపు మొగ్గు చూపిన జగన్

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్ MLAలు సింహాద్రి రమేష్ (అవనిగడ్డ), వల్లభనేని వంశీ (గన్నవరం), కొడాలి నాని (గుడివాడ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కైలే అనిల్ (పామర్రు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), మేకా ప్రతాప్ అప్పారావు (నూజివీడు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)లకు వారి స్థానాల్లో పోటీ చేస్తుండగా పెడన MLA జోగి రమేశ్ పెనమలూరు, విజయవాడ పశ్చిమ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్‌లో పోటీ చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.
News September 2, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన
News September 2, 2025
హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.