News January 7, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. వారం రోజులే గడువు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్ కోసం <
సైట్: https://exams.nta.ac.in/AISSEE/
Similar News
News January 9, 2025
టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్/ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది. వాటిని డీఈఓలు ఈ నెల 25లోగా తమకు పంపాలని ఆదేశించింది.
News January 9, 2025
స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో
స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.
News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం
TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్‌లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.