News January 7, 2025

కలకలం.. అమెరికాలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

image

USలో బర్డ్‌ఫ్లూ కారణంగా తొలిసారి ఓ మనిషి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. లూసియానాలో 65 ఏళ్ల వృద్ధుడు అడవి పక్షుల కారణంగా H5N1 వైరస్ సోకి ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. USలో ఇప్పటి వరకు 66 మందికి బర్డ్‌ఫ్లూ సోకింది. అయితే మనుషుల నుంచి మనుషుల్లో వ్యాప్తికి ఆధారాలు లభించలేదు. గతంలో బర్డ్‌ఫ్లూ సోకి మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయాడు.

Similar News

News January 9, 2025

హనీరోజ్‌ను వేధించిన బిజినెస్‌మ్యాన్ అరెస్ట్

image

హీరోయిన్ హనీరోజ్‌ను <<15073430>>వేధించిన<<>> ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీరోజ్‌ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.

News January 9, 2025

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం

image

AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

News January 9, 2025

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

image

శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ జోస్ హేజిల్‌వుడ్ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. జట్టుకు సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తారు. జట్టు: స్టీవ్ స్మిత్ (C), ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‌స్టస్, లబుషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, జోస్ ఇంగ్లిస్, మెక్‌స్వీనీ, వెబ్‌స్టర్, లయన్, స్టార్క్, కూపర్ కనోల్లీ, మర్ఫీ, ఖునేమాన్, సీన్ అబాట్.