News January 7, 2025

నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: నిర్మాతలు

image

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని క్లిప్పింగ్స్ వాడుకున్నందుకు నయనతారకు తాము నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. తాము రూ.5కోట్లు డిమాండ్ చేయలేదని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆమె తమ నుంచి ముందే NOC తీసుకున్నారని తెలిపింది. కాగా ఈ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీదాన్’ క్లిప్స్ వాడినందుకు నయన్‌పై హీరో ధనుష్ రూ.10కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2026

BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/

News January 15, 2026

కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.

News January 15, 2026

మమతకు షాక్.. I-PAC ఆఫీసు సోదాల కేసులో నోటీసులు

image

I-PAC ఆఫీసులో సోదాల కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ED విధుల్లో జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. CM మమత, రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. I-PAC ఆఫీస్‌లోని CCTV ఫుటేజీని భద్రపర్చాలని తెలిపింది. ED అధికారులపై నమోదైన FIRపై స్టే విధించింది.